ప్రజాశక్తి-అనకాపల్లి
హర్యానా రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ నుంచి జరుగుతున్న జాతీయస్థాయి టెన్నికాయిట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న జట్టు ఆల్ ఇండియా టీం ఛాంపియన్ షిప్ సీనియర్ మహిళా విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లభించిన మొట్టమొదటి పతకం కావడంతో క్రీడాకారులను ఏపీ టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు వైడి రామారావు, చైర్మన్ పివిజిఆర్.నాయుడు (గణబాబు) అభినందించారు. క్రీడాకారులు ఆర్.మౌనిక, జి.హేమ మాధురి, ఎం.ప్రవల్లిక, పి.రేణుక, ఎస్.పల్లవి శ్వేతా శ్రీ, జి.శ్రావణి, కోచ్ మేనేజర్ల జి.రాజు, అలేఖ్య, జాతీయ రెఫరీలు ఎం లక్ష్మణరావు, కె రమేష్ కృషికి జాతీయ టెన్నికాయిట్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎ.యాదయ్య, సీఈవో బీఎస్ నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి కెఎన్‌వి సత్యనారాయణ అభినందనలు తెలిపారు.










