Aug 05,2022 23:06

శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నాగిరెడ్డి

ప్రజాశక్తి- గాజువాక: వికాస్‌నగర్‌ రాజీవ్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా మూడు రోజుల జాతీయస్థాయి తైక్వాండో రెఫరీ బ్లాక్‌బెల్ట్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తైక్యాండో అసోసియేషన్‌ జిల్లాకార్యదర్శి ఎం. అచ్చంనాయుడు తెలిపారు. శిక్షణ తరగతులను ప్రారంభించిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, గాజువాకలో జాతీయస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించడం సంతోషకరమని, దీనికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు. ఇటువంటి శిక్షణతో క్రీడాకారులలో మానసికోత్సాహం, ఏకాగ్రత, మనోధైర్యం పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో 65వ వార్డు కార్పొరేటర్‌ బొడ్డు నరసింహపాత్రుడు, 76వ వార్డు వైసిపి ఇన్‌చార్జి సింహాద్రి అప్పన్న దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు దొడ్డి రమణ, తైక్వాండో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అచ్యుత్‌ రెడ్డి, కోశాధికారి అర్జున్‌రెడ్డి, తాటికొండ జగదీష్‌, తాటికొండ అచ్యుత్‌, మంగునాయుడు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన అత్తూర్‌ పంగోత్రా జాతీయ స్థాయి తైక్వాండో శిక్షణ ఇవ్వనున్నారు.