Oct 06,2023 21:22

   ఏలూరు : అండర్‌-19 షటిల్‌ సింగిల్స్‌ బాలుర విభాగంలో ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ కళాశాల విద్యార్థులు మంగం హర్ష, ఉప్పు తరుణ్‌ ఇద్దరు విద్యార్థులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనారని సిఇఒ వి.తులసీరామ్‌ తెలిపారు. జాతీయ స్థాయి స్కూల్‌ గేమ్స్‌, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ వారి ఆధ్వర్యంలో ఏలూరు సిఆర్‌ఆర్‌ కళాశాల ఇండోర్‌ స్టేడియంలో ఈనెల 5న నిర్వహించిన పోటీల్లో వీరు గెలుపొందారు. ఈ సందర్భంగా కళాశాలలో కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంపికైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. అనంతరం తులసీరామ్‌ మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంగం హర్ష తల్లిదండ్రులు హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మణరావు, విమలాదేవి, ఉప్పు తరుణ్‌ తల్లిదండ్రులు నాగభూషణం, సుభాషిణి, కళాశాలల ప్రిన్సిపల్స్‌ వి.కనకరత్నం, ఇ.మురళీకృష్ణ, కె.ప్రభాకరరావు, ఎస్‌.సత్యనారాయణ, సిహెచ్‌.శివకుమార్‌, కళాశాల ఎఒలు కె.మళ్లికార్జునరావు, వి.రాట్నాలు, ఎస్‌.రామాంజనేయులు, జె.నాగరాజు పాల్గొన్నారు.