జాతీయస్థాయి పరుగు పందానికి ఎంపికైన రమేష్
ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యం లో నిర్వహించిన జాతీయ స్థాయి 10 కిలోమీటర్ల పరుగు పందెంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి రమేష్ ప్రథమ స్థానం పొందాడు. ఈ మేరకు స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి శ్రీ వరం మాట్లాడుతూ, ఈనెల 8న గోవా రాష్ట్రంలో నిర్వహించిన జాతీయస్థాయి 10 కిలోమీటర్ల పరుగు పందెంలో తమ కళాశాలకు చెందిన గిరిజన విద్యార్థి రమేష్ మొదట స్థానంలో పొందడం గర్వంగా ఉందని అన్నారు. రమేష్ రాష్ట్రస్థాయిలో మూడవ బహుమతి పొందగా, జాతీయస్థాయిలో కేవలం 56 నిమిషాల 31 సెకండ్లలో మొదటి స్థానం పొంది ప్రధమ స్థానం సంపాదించి పథకంతో పాటు 50 వేల రూపాయల నగదును అందుకున్నట్లు తెలిపారు.










