Mar 17,2023 22:39

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: జాతీయస్థాయిలో పతకాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎన్టీఆర్‌ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ అజీజ్‌ పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ నుండి ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలోని టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో జరుగుతున్న రాష్ట్ర సీనియర్‌ జట్ల శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.దిలీప్‌ కుమార్‌ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఈ నెల 19 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న 19వ జాతీయస్థాయి సినీయర్‌ సాప్ట్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌ షిప్‌కు ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ పురుషుల, మహిళల జట్లు పయనమయ్యాయని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్‌ కోచ్‌ అజీజ్‌ జట్ల సభ్యులకు క్రీడా దుస్తులను అందజేశారు. జట్ల సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు వి.శ్రీనుబాబు, కోశాధికారి బి.నీరజ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ కరీమ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్‌ దారం నవీన్‌కుమార్‌, ఎన్టీఆర్‌ జిల్లా సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ సభ్యులు డి.సత్యనారాయణ, శాప్‌ కోచ్‌ లు వై.శివ రామకష్ణ, పి.ఇస్సాక్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.