Jan 03,2023 23:12

ప్రజాశక్తి-విజయవాడరూరల్‌: జాతీయ స్థాయిలో జరగనున్న సాప్ట్‌ బాల్‌ పోటీలకు నున్న జడ్‌పి హైస్కూల్‌ విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం వజ్రాల భూపాల్‌రెడ్డి తెలిపారు. ఇటీవల వైయస్‌ఆర్‌ కడప జిల్లా చిన్న మండెంలోని ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌ బాల్‌ అండర్‌-19 విభాగంలో నున్న జిల్లా పరిషత్‌ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినులు లేళ్ల పూర్ణ శ్రీ, తురక దివ్య ప్రతిభ కనబర్చారని తెలిపారు. త్వరలో చండీఘర్‌లో జరుగనున్న జాతీయస్థాయి సాఫ్ట్‌ బాల్‌లో ఆంధ్రప్రదేశ్‌ తరపున ఆడనున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిజికల్‌ డైరెక్టర్స్‌ ముత్యాల వెంకటేశ్వరరావు, విజయవర్మల, విద్యార్థినులను ను పాఠశాల ఫస్ట్‌ అసిస్టెంట్‌ సూరపనేని రవిప్రసాద్‌, ఆంగ్ల ఉపాధ్యాయులు మనోహర్‌కుమార్‌ అభినందించారు.