కడప జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 2 నుంచి గుంటూరులో నిర్వహించబోయే రాష్ట్ర మహిళ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మైకేల్ డేనియల్ ప్రదీప్ అన్నారు. సోమవారం సాయంత్రం కడప ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సుధీర్ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్స్ బాలికల ్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను రాష్ట్ర కార్యదర్శి మైఖేల్ డేనియల్ ప్రదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. జిల్లా స్థాయి ఎంపికల్లో మంచి ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ మంచిగా రాణిం చాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ పట్టుదలతో పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.థామస్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు బి. డేనియల్, మైకల్, కోచ్ లు హరి, సునీల్, క్రీడాకారులు పాల్గొన్నారు.
జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు వీరే..
గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి సీనియర్ మహిళ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారుల పేర్లను జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎం. సుధీర్ ప్రకటించారు. జిల్లా జట్టుకు ఎంపికైన వారిలో శ్రీదేవి (కెప్టెన్) వెన్నెల, సా విత్రి, సాహిఆన, రోహితారెడ్డి, అంజనా రెడ్డి, దుర్గ, మైధిలి, అశ్విని, శ్రీదేవి, చంద్ర వదన, షణ్ము గ, హేమ వందన, వర్షిత రెడ్డి, సాహిత్య, గీతాంజలి, రెడ్డమ్మ, నిహారిక, సిరి చందన ఉన్నారు.