Feb 12,2023 23:02

ప్రజాశక్తి-నందిగామ 

నందిగామ పట్టణంలో కాకాని నగర్‌ మాజీ ఎమ్మెల్యే సౌమ్య కార్యాలయంలో తెదేపా శ్రేణులతో కలిసి ఆత్మ నిర్భర్‌ భారత్‌ వికాస్‌ రత్న జాతీయస్థాయి అవార్డు గ్రహీత రామిరెడ్డి శ్రీధర్‌ ను (ఎల్‌ఐసి) మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ పర్యావరణ ప్రేమికులు రామిరెడ్డి శ్రీధర్‌ జిల్లా పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా ఆయన ఎన్నో ఎనలేని సేవలను అందిస్తున్నందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని అన్నారు. ఆయన జాతీయ స్థాయిలో ఆత్మ నిర్భర్‌ భారత్‌ వికాస్‌ రత్న అవార్డు కేంద్ర మంత్రి చేతుల మీదగా అందుకోవటం అది మన నియోజకవర్గ ఓటరుగా ఉండటం చాలా గర్వకారణం అన్నారు.పెద్ద పెద్ద వక్షాలకు,చెట్లకు నష్టం కలిగించే విధంగా వ్యాపార సంస్థల ప్లాస్టిక్‌, ఐరన్‌ రేకులను ఎక్కడికక్కడ తొలగిస్తూ చెట్లకు సైతం ప్రాణం ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియపరచాలని ఆయన పడే తాపత్రయం ప్రత్యేక అభినందనీయం,ప్రతి ఏటా రంగురంగుల వినాయక బొమ్మలను ప్రోత్సహించకుండా, వినాయక చవితి పండుగను ఒక మంచి వాతావరణంలో జరుపుకోవాలని స్వచ్ఛందంగా వేల మట్టి విగ్రహాలను ఉచితముగా ప్రజలకు అందజేయడం ఆయన మంచితనానికి మారుపేరు అని తెలిపారు.పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. కార్యక్రమంలో వివిధ హౌదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.