Aug 03,2022 00:18

మాట్లాడుతున్న ఆర్‌టిఒ జయప్రకాష్‌

ప్రజాశక్తి-యంత్రాంగం : దేశానికి త్రివర్ణ పతాకాన్ని తీర్చిదిద్ది అందించిన స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతిని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
విశాఖపట్నం : ఏయూ పరిపాలనా భవనంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి వీసీ ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య పేరి శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త ఆచార్య ఎస్‌.హరనాథ్‌, ఆచార్య ఎన్‌ఎడి పాల్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ పతాకం విశిష్టతను తెలుపుతూ ఏయూ ఎఆర్‌ రాజేశ్వరి దేశభక్తి గీతాన్ని ఆలపించారు.
ములగాడ : 58వ వార్డు పరిధి శ్రీహరిపురంలోని జివిఎంసి ఉన్నత పాఠశాలలో పింగళి వెంకయ్య జయంతిని నిర్వహించారు. జాతీయ పతాకం గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంవి.లక్మణ వివరించారు. ఈ కార్యక్రమములో పద్మజ, ఎంఎస్‌ ప్రకాష్‌, సుధారాణి, నూకరాజు, రవి, రవీంద్ర, పుష్పలత, మనోహర్‌ పాల్గొన్నారు.
గాజువాక : అగనంపూడి కాలనీ స్టార్‌డం ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో జయంతిని నిర్వహించారు. పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాజువాక రోడ్డు రవాణా అధికారి బి.జయప్రకాష్‌ మాట్లాడుతూ, పింగళి వెంకయ్యను యువతరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిసి చైర్మన్‌ బలిరెడ్డి సత్యనారాయణ, స్కూల్‌ కరస్పాండెంట్‌ ఎస్‌ రంగారావు, కె.హనుమంతరావు, విందుల వరహాలు, బుద్ధి రెడ్డి అప్పారావు పాల్గొన్నారు.
భీమునిపట్నం : స్థానిక వైసిపి కార్యాలయంలో మూడో వార్డు పార్టీ అధ్యక్షులు అల్లిపిల్లి నరసింగరావు ఆధ్వర్యాన పింగళి వెంకయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి కొండబాబు, కదిరి ఎల్లాజీ, పిన్నింటి ఎర్రయ్యరెడ్డి, గొరపల్లి సన్యాసిరావు, చెల్లూరి గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు.
తగరపువలస : జివిఎంసి ఒకటో వార్డు పరిధి తగరపువలస, బంగ్లామెట్ట ప్రాథమిక పాఠశాలలో పింగళి జయంతి నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెడ్డిపల్లి అప్పల రాజు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆనందపురం : మండలంలోని వేములవలస ప్రాథమిక పాఠశాలలో జయంతిని నిర్వహించారు. ఉప సర్పంచ్‌ కోరాడ నవీన్‌ జ్ఞానేశ్వర్‌ కేక్‌ కట్‌ చేశారు. విద్యార్థులకు త్రివర్ణ పతాకాలు అందజేసి విశిష్టతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం స్వర్ణలత, సుభాషిని, పేరెంట్స్‌ కమిటీ ఉపాధ్యక్షులు దీక్ష, అంగన్వాడీ కార్యకర్త నదియా, వడ్ల భార్గవ్‌, నడిమింటి అప్పలరాజు, బోధ రాజు, కోరాడ రమణ, బోధ నారాయనప్పడు పాల్గొన్నారు.