ప్రజాశక్తి-అనకాపల్లి : ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు హర్యానాలో జరిగే 46వ జాతీయ టెన్నికాయిట్ పోటీలకు మహిళ, పురుష జట్లను ఎంపిక చేసినట్టు ఆంధ్రప్రదేశ్ టెన్నికాయిట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కెఎన్‌వి సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు తెలిపారు. క్రీడాకారులకు అనకాపల్లి జీవీఎంసీ అంబేద్కర్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళ విభాగంలో రెడ్డి మౌనిక, పి రేణుక, ఎం ప్రవల్లిక, జి శ్రావణి, జి హేమ మాధురి, ఎస్ పల్లవి శ్వేత ఆడనున్నారని, మేనేజర్‌గా అలేఖ్య వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పురుష విభాగంలో పిజెఎండి రామారావు, వి వినరు కుమార్, ఎల్ త్రిమూర్తులు, బి పవన్ కుమార్, ఎన్ నితిన్, కే శివ ఆడతారని, మేనేజర్‌గా కె రమేష్ వ్యవహరిస్తారని తెలిపారు.










