గుంటూరు: నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేరళలో జరుగుతున్న కుమార్ సురేంద్రసింగ్ మెమోరియల్ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్, తాడిగడప షూటర్స్ దాయం అక్షయి, ఉమా మహేష్ బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పీప్సైట్ మిక్స్‌డ్ యూత్ విభాగంలో బంగారు పతకం సాధించింది.ఫైనల్స్‌లో 16-6 పాయింట్లతో ఎపి జట్టు ఉత్తర ప్రదేశ్‌పై బంగారు పతకం గెలుపొందారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పీప్సైట్ మిక్స్‌డ్ యూత్ విభాగంలో బంగారు పతకం రావటం ఇదే ప్రథమం అని తెలియజేస్తూ, అక్షయి, ఉమా మహేష్‌కు రాప్ సెక్రెటరీ రాజ్‌కుమార్, ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కెఎల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ డీన్ హారి కిషోర్ తదితరులు అభినందించారు.










