Nov 18,2023 19:29

విద్యార్థిని అభినందిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన హ్యాక్థన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాంపిటీషన్‌లో డేటా అనలిటిక్స్‌ ఉపయోగించి నేల లక్షణాలను నిర్ణయించడంలో ఎమ్మిగనూరు పట్టణ వాసి బి.భువిన్‌ విజేతగా నిలిచారు. శనివారం పట్టణంలోని హెచ్‌బిఎస్‌ కాలనీ గల విజ్ఞాన్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని వోగ్జెన్‌ యూనివర్సిటీలో బిటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న భువిన్‌ అనే విద్యార్థిని సోషల్‌ సర్వీస్‌ వర్కర్‌ మోనె శ్రీరాములు, పాఠశాల ప్రిన్సిపల్‌ మోహన్‌లు కలిసి శాలువా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలోని వందకు పైగా యూనివర్సిటీల నుంచి జాతీయస్థాయిలో అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. హ్యాక్థన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాంపిటీషన్‌లో ఎమ్మిగనూరుకు చెందిన విద్యార్థి విజేతగా నిలవడం విశేషమన్నారు. భవిష్యత్తులో మరిన్నీ విజయాలు అందించాలని ఆకాంక్షించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ ఉషా పరిమళ, రేఖ, ఫమీన సతీష్‌, ముజీబ్‌, రఫిక్‌, కేశవ, తిమ్మప్ప, మెహబూబ్‌, రాము పాల్గొన్నారు.