Aug 21,2023 00:12

జాతీయ స్థాయిలో డాక్టర్‌ సిపాయికి అరుదైన గౌరవం
ఫిస్టులా సదస్సులో సన్మానం
ప్రజాశక్తి-రేణిగుంట:
ముంబైలో జరుగుతున్న జాతీయ ఫిస్టుల సదస్సులో రష్‌ ఆసుపత్రి అధినేత ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యంకు అరుదైన గౌరవం లభించింది. ముంబైలో జరుగుతున్న జాతీయ ఫిస్టులా సదస్సు 2023లో తిరుపతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అధినేత ప్రముఖ యూరో లేజర్‌ సర్జన్‌ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యంను భారత కోలో రెక్టల్‌ సర్జన్‌ సంఘం అధ్యక్షులు డాక్టర్‌ పర్వేష్‌ నిర్వాహకులు నిరంజన్‌ అగర్వాల్‌ సన్మానించారు. ఫిస్టులా భగంధరాల చికిత్సలలో వస్తున్న అదునాత లేజర్‌ విధానాలతో పాటు పురాతన దేశి ఆయుర్వేద శస్త్రచికిత్స విధానాలపై జాతీయ అంతర్జాతీయ నిపుణులు తమ వైజ్ఞానిక పత్రాలతో పాటు లైవ్‌ వర్క్‌షాప్‌ల ద్వారా అధునాతన మెలకువలను దేశం నలుమూలల నుంచి వచ్చిన శస్త్రచికిత్స మెలుకువలను నిపుణులకు వివరించారు. కోత, కుట్లు, రక్త నష్టం లేకుండా 12 గంటలలో డిశ్చార్జ్‌ అవ్వగలిగే సౌలభ్యం లేజర్‌ వల్ల ఉన్నట్లు నిపుణులు వివరించారు. ఈమొత్తం సదస్సు కార్యక్రమాలను వివిధ రాష్ట్రాలలోని 50కేంద్రాలలో వేలాది మంది శస్త్రచికిత్స నిపుణులు దూర దశ్య మాధ్యమం ద్వారా వీక్షించారు. భగంధరము, ఫిస్టులా, మొలలు, సైనస్‌ మొదలగు కోలోరెక్టల్‌ వ్యాధులకు ఫ్యాకల్టీగా డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యంను ఈ సదస్సు లో ఎంపిక చేశారు.