జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలలో 'శ్రీ పద్మావతి' విద్యార్థినుల ఉత్తమ ప్రతిభ
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలలో
'శ్రీ పద్మావతి' విద్యార్థినుల ఉత్తమ ప్రతిభ
ప్రజాశక్తి - క్యాంపస్ : హర్యానా రాష్ట్రంలో రోతక్ లోని ఎండి యూనివర్సిటీలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, గ్రాఫ్లింగ్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగిన మూడవ నేషనల్ గ్రా ఫ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున టిటిడికి చెందిన శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 13 పతకాలు కైవసం చేసుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.భువనేశ్వరి వెల్లడించారు. క్యాడెట్స్ బాలికల విభాగంలో కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ఎన్.సుప్రియ, సిఇఎల్ బంగారు పతకం, సిల్వర్, వై.సౌమ్య, సిఇసి బంగారు పతకం, పి.భూమిక, సిఇసి సిల్వర్, జి.అంజలి, ఎమ్‌ఇసి సిల్వర్, బి.మేఘన-ఎమ్‌ఇసి, ఎం.నాగగీతిక హెచ్‌ఈసి, కె.మధులత హెచ్‌ఈసి, మేఘన సత్య బైపిసి, వై.శిరీష బైపిసి, కె.సుజిత సిఇసి, ఎ.వర్షప్రియ ఎమ్‌ఈసి, వి.సుస్మిత, హెచ్‌ఇసి వీరందరూ బ్రాంజ్ మెడల్ సాధించారు. విద్యార్థినులందరినీ ప్రోత్సహించి, టిటిడి యాజమాన్యం కల్పిస్తున్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని చదువులో, క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని కోరారు. ఈ పతకాలను సాధించడానికి కృషిచేసిన ఫిజికల్ డైరెక్టర్ సాయి సుమతిని అభినందించారు.










