Mar 24,2023 00:05

విద్యార్థులతో ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -పాయకరావుపేట:కష్ణా జిల్లా గన్నవరం లో జనవరి 13, 14 న జరిగిన 37 వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాలుర పోటీలలో శ్రీ ప్రకాష్‌లో 9 వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు విద్యా సంస్థల సీనియర్‌ ప్రిన్సిపల్‌ ఎమ్‌వివిఎస్‌ మూర్తి తెలిపారు. ఈ నెల 27 నుండి 31 వరకు అస్సాం రాష్ట్రం గౌహతిలో జరిగే 37వ జాతీయ స్థాయి సబ్‌ జూనియర్స్‌ హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్‌.వి.కె.నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజరు ప్రకాష్‌, ప్రదానోపాధ్యాయులు డి.వి. శ్రీనివాస్‌, కోచ్‌లు సురేష్‌, బాలరాజు, సహచర విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు అభినందించారు.