Oct 12,2023 19:53

విద్యార్థిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - ఆస్పరి
విద్యార్థులు జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై సత్తా చాటాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి కుమార్‌, వ్యాయామ ఉపాధ్యాయులు విష్ణువర్ధన్‌ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం వారు మాట్లాడారు. బుధవారం కర్నూలులో జరిగిన జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో నగరూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి వి.రఘువరన్‌ అండర్‌-17 విభాగంలో సాఫ్ట్‌ బాల్‌ జిల్లా స్థాయి పోటీల్లో రాణించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. అక్కడ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.