Sep 29,2023 00:20

పల్నాడు జిల్లా: ఈ నెల 27న ఖేలో ఇండియాలో భాగంగా కాకినాడ జేఎన్టీయూలో రాష్ట్ర స్థాయి మహిళా కోకో జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి అండర్‌ -18 విభాగంలో తమ కళాశాల విద్యార్థిని బి.అలేఖ్య ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ నాతాని వెంక టేశ్వర్లు గురువారం ప్రకటనలో తెలిపారు. అలేఖ్య వచ్చే నెల 6 నుండి 8వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా లోని సెయింట్‌ జాన్‌ గర్ల్స్‌ హై స్కూల్లో ఖేలో ఇండియా ఉమెన్‌ లీగ్‌ సౌత్‌ జోన్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున అలేఖ్య పాల్గొననున్నట్లు కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ఈదర ఆది బాబు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్‌ కె.నాస రయ్య, కోచ్‌ షేక్‌ మొహమ్మద్‌ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అభి నందించారు. జాతీయస్థాయిలో ప్రతిభ చాటి కళాశాలకు పల్నాడు ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు.