ప్రజాశక్తి- దేవరాపల్లి
జాతీయస్థాయి టెన్నిస్, వాలీబాల్ పోటీలకు జిల్లాల్నోఇ పలు గురుకుల పాఠశాలల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల కర్నూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టెన్నిస్, వాలీబాల్ పోటీల్లో తెనుగుపూడి గురుకులం నుంచి టి.అంజిత్, కోనాం నుంచి సిహెచ్.దివ్యవాణి, ధనజ శ్రీదుర్గ, టి.పిస్కిల్లా, తాళ్లపాలెం నుండి కె.కీర్తి, సబ్బవరం నుండి ఇద్దరు విద్యార్థులు ప్రతిభ కనబర్చి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను గురుకులాల జిల్లా సమన్వయకర్త ఎస్.రూపవతి తెనుగుపూడి గురుకులంలో మంగళవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిహెచ్.రవీంద్రనాథ్, పిడిలు బి.రాంబాబు, సిఎల్‌ఎం.ప్రసాద్, ఎన్.సావిత్రి దేవి, వి.సూర్యనారాయణ, జి. తరునేశ్వరరావు, తల్లిదండ్రులకు కమిటీ చైర్మన్ ఉల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు










