ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: చిత్తూరు జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుముడింపజేసేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.షన్మోహన్ తెలిపారు. గురువారం జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులతో జపాన్‌లో జరిగే అంతర్జాతీయ సకురా ప్రాజెక్ట్ అండ్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్‌లో ప్రదర్శించే జి బ్యాక్స్ స్మార్ట్ ఎగ్జిబిషన్ ప్రాజెక్టుకు సంబంధించి కలెక్టర్‌కు వివరించారు. 9వజాతీయ స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్, ప్రాజెక్టు కాంపిటీషన్ ప్రదర్శనలో పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనపరిచి జపాన్‌లో జరిగే సకురా ప్రదర్శనకు ఎంపికైన గుడిపాల మండలం జడ్పీహెచ్‌ఎస్ ఏఎల్ పురం 8వ తరగతి విద్యార్థి కే.ప్రణయ గైడ్, టీచర్ శ్రీరంగలక్ష్మి, పీలేరు మండలం జంగంపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో 9వ తరగతి చదువుతున్న పడిగల చరణ్ తేజ్, జిల్లా సైన్స్ ఆఫీసర్ ఆర్‌వి. రమణ, ఇతర సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు పెరిగేలా ప్రాజెక్టులను ఎలా అభివద్ధి చేయాలో వారికి సూచనలు చేశారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ ఆర్‌వి రమణ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి జిల్లా ప్రొఫెసర్ ఈశ్వర్ రామిరెడ్డి, ప్రొఫెసర్ శ్రీరామ్ సుందర్, పివికేఎన్ కాలేజ్ లెక్చరర్ భాను ప్రకాష్, అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కుప్పం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కుమార్ వీరందరి ఆధ్వర్యంలో జపాన్‌కు వెళ్లే ప్రోటో టైప్ ప్రాజెక్ట్స్ కం ఎగ్జిబిట్స్ మార్పులతో భవిష్యత్తు ప్రణీతంలో పరిశోధనాత్మకంగా మార్పులు చేర్పులతో మూడు దశలలో అభివద్ధి పరిచి సత్ఫలితాలతో బాలశాస్త్రవేత్తలను నుంచి జపాన్ సకురాలో నవంబర్ 5 నుండి 7వ తేదీవరకు జరిగే ప్రదర్శనలో పాల్గొనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.










