
ప్రజాశక్తి -నక్కపల్లి:జాతీయ హాకీ క్రీడా పోటీలకు నక్కపల్లి బలిరెడ్డి సత్యవతి హాకీ క్లబ్ క్రీడాకారులు ఎంపికైనట్లు హాకీ క్లబ్ ఫౌండర్ బలిరెడ్డి సూరిబాబు, అధ్యక్షులు చిన్న అప్పారావు, ప్రధాన కార్యదర్శి కొల్నాటి తాతాజీ గురువారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 66వ నేషనల్ స్కూల్ గేమ్స్ 2022-23 సంవత్సరానికి గాను గత ఏడాది డిసెంబర్ 30 నుండి జనవరి 1వరకు నక్కపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో నక్కపల్లి బియస్ హాకీ క్లబ్ క్రీడాకారులు పి.రోహిత్ కే.అనురాధ, బి.అభిషేక్, ఎస్.మణికంఠ ప్రతిభ కనబర్చడంతో జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ఆడేందుకు అర్హత పొందారన్నారు. ఈ నెల 8 నుండి 12 వరకు మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగే జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కోచ్ రాంబాబు, కే.నానాజీ, రామచంద్ర రావు, ప్రసాద్, కే.సతీష్, రంజిత్ తదితరులు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.