Aug 12,2023 21:02

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసులు

రాయచోటి టౌన్‌ : ఈ నెల 14న రాయచోటి పట్టణంలో జాతీయ ఉద్యమ స్ఫూర్తితో సాంస్కతిక కార్యక్రమాల సభను జనజాగరణ పేరుతో నిర్వహిస్తున్నట్లు వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు, ప్రజానాట్య మండలి జిల్లా కన్వీనర్‌ వెంకటాచలపతి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.రామచంద్ర, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కో-కన్వీనర్‌ డి.సి.వెంకటయ్య పేర్కొన్నారు. శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రజాసంఘాల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకనుగుణంగా నాడు స్వాతంత్రోద్యమ కాలంలో ఆశేష భారతావని బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల్ని తరిమికొట్టారని పేర్కొన్నారుర. అదే స్ఫూర్తితో అంతర్జాతీయ పెట్టుబ డిదారులను భుజాన మోస్తున్న దేశీయ కార్పొరేట్‌ శక్తుల విధానాల వలన ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలను శ్రమ దోపిడి చేశారని తెలిపారు. రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లతో పాటు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి దేశాన్ని అభివద్ధిలో వెనక్కి నెడుతున్నారని విమర్శించారు. ఈ దేశ దౌర్బాగ్యమైన పరిస్థితుల నుండి బయటపడేందుకు ప్రజలను చైతన్యం చేయు టకు 14న సాంస్కతిక కార్యక్రమాల సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమా వేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి.రమాణారెడ్డి, ఉపాధ్యక్షులు కె.నాగ బసిరెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎస్‌.ఓబులమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ, కెవిపిఎస్‌ నాయకులు దిలీప్‌, నిరంజన్‌, గోవింద్‌ పాల్గొన్నారు