Sep 14,2023 20:28

రాయచోటి : ప్రేమ్‌చంద్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఉపాధ్యాయులు

రాయచోటి : విభిన్న భాషల సమహారంగా ఉన్న భారతదేశంలో జాతీయ సమైక్యతకు ప్రతీకగా హిందీ కొనసాగుతున్నదని ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం హిందీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట ప్రేమ్‌ చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి హిందీ సాహిత్యానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన జాతీయ భాషగా పేరుగాంచిన హిందీ భాషకు సెప్టెంబర్‌ 14న ఒక ప్రత్యేకత ఉందన్నారు. 1949వ సంవత్సరం సెప్టెంబర్‌ 14వ తేదీన హిందీ భాషను అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అప్పటి నుండి ఈ తేదీని హిందీ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. అధికారిక భాష హిందీ దేవనాగరిక లిపి నుంచి రూపొందించబ డిందని తెలిపారు. మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా దేశంలో ఐక్యతను తీసుకురావడానికి ఈ భాషనే ఎక్కువగా వాడేవారని అందుకే ఈ భాషను లాంగ్వేజ్‌ ఆఫ్‌ యూనిటి గా పిరుస్తున్నారన్నారు. హిందీని దేశంలోనే కాక, మారిషస్‌, న్యూజిలాండ్‌, అమెరికా, ట్రినినాడ్‌ వంటి దేశాలలో కూడా ఎక్కువగా మాట్లాడుతు న్నారన్నారు. ప్రపంచంలో 150 కంటే ఎక్కువ యూనివర్సిటీలు హిందీకి సంబంధించిన కోర్సులను నిర్వహిస్తున్నాయన్నారు. భారత మాజీ ప్రధాని అటల్‌బీహారీ వాజ్‌పేయి హిందీ భాషలో ఐక్యరాజ్యసమితిలో మాట్లాడి హిందీభాషా మాధుర్యాలను ప్రపంచానికి తెలియజేయడం జరిగిందన్నారు. అనంతరం హిందీ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, వకత్వ,డ్రాయింగ్‌ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు హిందీ ఉపాధ్యాయులు సుజాతబాయి, మహబూబ్‌ భాష బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యా ర్థులు పాల్గొన్నారు.నందలూరు : మండలంలోని పాటూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి లత ఆధ్వర్యంలో హిందీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. కార్యక్రమంలో హిందీ భాష ఉపాధ్యాయులు షఫీవుల్లా, సుదర్శన్‌ రాజు, శంకర్‌ రెడ్డి, వీరారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, కిరణ్‌ కుమార్‌, శారద, అమర్నాథ్‌, పవన్‌, కుమారి, శైలజ, లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు దోహదపడిన భాష హిందీ భాష అని కొత్త బోయినపల్లి ప్రదానోపాధ్యాయురాలు కె.భారతి అన్నారు. మండల పరిధిలోని కొత్త బోయినపల్లి ఎస్‌జెఎస్‌ఎం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం హిందీబాషా వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదానోపాధ్యాయులు కె.భారతి, గుంటూరు రిటైర్డ్‌ హిందీ ఉపాధ్యాయులు శేషంరాజు, హిందీ ఉపాధ్యాయులు యస్‌.వి రామరాజు, యన్‌.అమరావతి ని శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు.బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా,బి.కొత్తకోట పట్టణం,ఎ.పి.ఆదర్శ పాఠశాలలో హిందీ భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా హిందీ భాషపై విద్యార్థులకు వక్తత్వ, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి మండల విద్యాశాఖ అధికారి రెడ్డిశేఖర్‌ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శీనునాయక్‌, ఉపాధ్యాయులు జహీర్‌ఖాన్‌, నాగసాయిలీల, నూర్‌ మహమ్మద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.పుల్లంపేట : మండల పరిధిలోని టి.కమ్మపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జాతీయ హిందీ భాష దినోత్సవం ఆ పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు సయ్యద్‌ సర్తాజ్‌హుస్సేన్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సబితా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బాల నరసింహులు, షామీర్‌ హుస్సేన్‌, ఆసిఫ్‌ భాష, శేషాద్రి, హేమలత, రమణయ్య, ప్రమీల కుమారి పాల్గొన్నారు. గాలివీడు : స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల గాలివీడులో జాతీయ హింది భాషా దినోత్సవం ఇన్‌ఛార్జి ప్రదనో ఉపాధ్యాయులు కె.శివారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. .ఈ కార్యక్రమంలో శివారెడ్డి మాట్లాడుతూ హింది భాష లిపి గురించి పిల్లలకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌ : స్థానిక జడ్‌పిఉన్నత పాఠశాలలో హిందీభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ భాష ఔన్నత్యం గురించి వివరించారు. హిందీ ప్రపంచంలోనే అత్యధికం గా మాట్లాడే మూడవ అతి పెద్ద భాష అన్నారు. హెడ్మాస్టర్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ హిందీ భాష మాధుర్యాన్ని వివరించారు. కార్యక్రమంలో హిందీ విభాగాధిపతి వసుదా రూటా రాష్ట్ర నాయకులు మహమ్మద్‌ ఖాన్‌ సుధాకర్‌ నాయుడు ఆర్‌.వి.రమణ నాగరాజ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.