Apr 11,2023 23:02

ప్రజాశక్తి - ఉంగుటూరు
             దాళ్వా కోతలు మండలంలో ప్రారం భమయ్యాయి. తేమ శాతం నుంచి బయట పడేందుకు కల్లాలు లేకపోవడంతో జాతీయ రహదారులపై రైతులు ధాన్యాన్ని ఆరపెట్టుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుపక్కనే ఉంటూ ధాన్యం రాసులను ఆరపెట్టుకుంటున్నామని రైతులు రామారావు, సుబ్బారావు తెలిపారు. వరి కోతలు ప్రారంభమైనా నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో కర్షకులు దిగాలు చెందుతున్నారు.