జాతీయ రహదారి నిర్మాణానికి భూమి పూజ
- జగనన్న కాలనీకి రోడ్ కమ్ బ్రిడ్జి ప్రారంభం
- పాల్గొన్న మంత్రి బుగ్గన, జెడ్పిటిసి, కలెక్టర్
ప్రజాశక్తి - బేతంచెర్ల
ఓర్వకల్ మండలం సోమయాజుల పల్లె నుంచి బేతంచెర్ల మీదుగా డోన్ వరకూ చేపడుతున్న జాతీయ రహదారి-340 నిర్మాణానికి మండలంలోని హెచ్.కొట్టాలలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. అంతకుముందు మంత్రి హెచ్ కొట్టాల రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రూ.630 కోట్ల అంచనాతో ఓర్వకల్ మండలం సోమయాజుల పల్లె నుంచి బేతంచెరంల మీదుగా డోన్ వరకూ 53 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బేతంచెర్ల పట్టణంలోని జగనన్న కాలనీకి రూ.1.2 కోట్లతో చేపట్టిన కీలకమైన రోడ్ కమ్ బ్రిడ్జిని కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ఏఈ పూనిరామ్, ఈఈ ఇందిరమ్మ, డిఈ రామచంద్ర, రాధిక, బేతంచెర్ల మున్సిపల్ చైర్మన్ చలం రెడ్డి, ఎంపిపి నాగభూషణం, తహశీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, గోరుమాన్ కొండ సర్పంచి కోడె వెంకటేశ్వర్లు, ముర్తుజావలి, ఖాజా హుస్సేన్, ఎద్దులన్న, తిరుమలేశ్వర్ రెడ్డి, జెడ్పిటిసి శివలక్షమ్మ, ఎంపిటిసి రత్నమ్మ, హెచ్.కొట్టాల సర్పంచి వెంకట లక్షమ్మ, వైసిపి నాయకులు పాల్గొన్నారు.











