ప్రజాశక్తి - బాపట్ల
భరతజాతికి అస్తిత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించిన పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎన్ మదన్మోహన్ చెట్టి అన్నారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద గల పింగళి వెంకయ్య విగ్రహానికి బుధవారం పూలమాలవేసి నివాళులు అర్పించారు. పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకం ఉద్యమాలకు ఊపిరిగా, సమరయోధులకు ఆయుధంగా నిలిచిందన్నారు. జాతీయస్థాయిలో తెలుగువారి గౌరవాన్ని ఇనుమడింప చేశారని అన్నారు. కార్యక్రమంలో పోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, లజపతి రారు, ఏవివి హై స్కూల్ ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వేటపాలెం : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబీకులను ఆదుకోవాలని పలువురు వక్తలు కోరారు. వేటపాలెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య మనుమరాలు కనకదుర్గ భవాని ఇంటి వద్ద జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 147వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు బట్ట మోహన్ రావు మాట్లాడుతూ పింగళి వెంకయ్య దేశానికి చేసిన సేవ మరువలేనిదని అన్నారు. జాతీయ పతాకంతో మన దేశానికి ఎనలేని గుర్తింపు గౌరవం లభించిందని అన్నారు. తొలుత వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కనకదుర్గ భవాని, సీతారామయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. క్లబ్బు కార్యదర్శి ఏవి సురేష్, క్లబ్బు సభ్యులు పత్తి వెంకట సుబ్బారావు, పొగడ దండ రవికుమార్, డాక్టర్ కారంచేటి శివరామకష్ణ, కొత్త వాసు, సీతారామయ్య, ఖదీర్ భాష, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.










