
ర్యాలీ నిర్వహిస్తున్న శంకర్ ఫౌండేషన్ సిబ్బంది
ప్రజాశక్తి-వేపగుంట : నాయుడుతోటలోని శంకర్‌ఫౌండేషన్ ఆధ్వర్యాన ఆసుపత్రి నుంచి వేపగుంట వరకు మంగళవారం జాతీయ నేత్రదాన ప్రచార ర్యాలీ నిర్వహించారు. ''కళ్లను దానం చేయండి- ప్రాణాన్ని కాపాడండి'', ''కంటికి చావు లేదు - కళ్లను దానం చేయండి'' అని నినాదాలు చేశారు. శంకర్ ఫౌండేషన్ కార్నియా విభాగం డైరెక్టర్, హెచ్‌ఒడి డాక్టర్ నస్రెన్ ర్యాలీకి నాయకత్వం వహించారు. కార్నియా మార్పిడి కొరతను నివారించడంలో భాగంగా, నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను, మరణించిన తర్వాత కళ్లను ఎందుకు దానం చేయాలన్నదాని గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.