May 13,2023 22:44

పెద్దపురంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి సరస్వతి

ప్రజాశక్తి - పెద్దాపురం
పెద్దాపురం కోర్టులలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ లో 564 కేసులు పరిష్కారం అయ్యాయని మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌ సరస్వతి తెలిపారు. ఈ లోక్‌ అదాలత్‌ల నిర్వహణకు నాలుగు బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. మొదటి బెంచ్‌కు 7వ అదనపు జిల్లా జడ్జి ఎం.హరినారాయణ అధ్యక్షత వహించగా న్యాయవాది ఎస్‌.దుర్గారావు సభ్యులుగా, 2వ బెంచ్‌ కు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌ సరస్వతి అధ్యక్షులుగా న్యాయవాది ఏ ప్రభూజి సభ్యులుగా, 3వ బెంచ్‌కు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.శ్రీదేవి అధ్యక్షులుగా, న్యాయవాది ఎం.రాంబాబు సభ్యులుగా, 4వ బెంచ్‌ కు అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.నాగమల్లేశ్వరి అధ్యక్షులుగా, న్యాయవాది బి.ప్రసాద్‌ సభ్యులుగా వ్యవహరించార న్నారు. ఈ జాతీయ లోక్‌ అదాలత్‌లో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వేదుల సుబ్ర హ్మణ్యం (మణి) న్యాయవాది ఎస్‌ విశాలాక్షి, న్యాయ వాదులు పాల్గొన్నారు. ఈ లోక్‌అదాలత్‌కు హాజరైన కక్షిదారులకు రోటరీ క్లబ్‌, ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ల ఆధ్వర్యంలో ఫలహారాలు, మజ్జిగ పంపిణీ చేశారు.