May 13,2023 23:19

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్‌ వైవిఎస్‌బిజి పార్థసారధి ఆధ్వరంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ లోక్‌ అదాలత్‌లో జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న, రాజీపడదగిన కేసులు పరిష్కరించారు. సివిల్‌ 335, క్రిమినల్‌ కేసులు 4203, ప్రీలిటిగేషన్‌ 113, మొత్తం 4651 కేసులు పరిష్కరించారు. ఈ జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహణకు సహకరించిన న్యాయాధికారులకు, న్యాయవా దులకు, పోలీసు సిబ్బందికి, కక్షిదారులకు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.చంద్రమౌళీశ్వరి ధన్యవాదాలు తెలిపారు.