Aug 19,2023 17:20

మాట్లాడుతూన్న న్యాయమూర్తి శ్రీనివాసులు నాయక్‌

- న్యాయమూర్తి శ్రీనివాసులు నాయక్‌
ప్రజాశక్తి-పీలేరు:జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని పీలేరు సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసులు నాయక్‌ తెలిపారు. శనివారం స్థానిక న్యాయ స్థానంలో న్యాయమూర్తి న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సెప్టెంబర్‌ 9న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో సివిల్‌, క్రిమినల్‌, కుటుంబ తగాదారులు, ఎంఇఒపి, ఇతర పాత, కొత్త కేసులు అధిక సంఖ్యలో రాజీమార్గంలో పరిష్కారం చేసుకునేలా కచ్చి దారులకు అవకాశం కల్పించాలని తెలియజేశారు. రాజీమార్గమే రాజ మార్గమని వారికి తెలియజేస్తూ, లోక్‌ అదాలత్‌ ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేందుకు తోడ్పడాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎపిపి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌ఎండి అన్సారి, న్యాయవాదులు భవానీ శంకర, షౌకత్‌ అలీ, వెంకటరమణా రెడ్డి, సివి రెడ్డి, దినకర్‌, ప్రసాద్‌, రవీంద్రనాథ్‌ రెడ్డి, వజ్రాల మునార్‌ బీ, సుమలత, రాణి, కోర్టు సిబ్బంది మస్తాన్‌, నాగేంద్ర నాయక్‌ పాల్గొన్నారు.