May 13,2023 22:43

కాకినాడ జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్న న్యాయమూర్తి

ప్రజాశక్తి - కాకినాడ క్రైమ్‌
కాకినాడ కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 1750 కేసులు పరిష్కరించామని న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్‌, న్యాయమూర్తి పి.కమలాదేవి తెలిపారు. మొత్తం తొమ్మిది బెంచ్‌లు ఏర్పాటు చేయగా వీటిని న్యాయమూర్తి కమలాదేవి, నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి హరినారాయణలు పరిశీలించారు. ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఎల్‌.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ ఎన్‌.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వి.లీలాశ్యామసుందరి, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.ప్రసన్నలక్ష్మి, మూడో అదనపు జెఎఫ్‌సిఎం. న్యాయ మూర్తి డి.శ్రీదేవి, నాలుగవ అదనపు జెఎఫ్‌సిఎం న్యాయమూర్తి నిరూప బండ డియో, ఐదవ అదనపు జెఎఫ్‌సిఎం న్యాయమూర్తి షేక్‌ షరీన్‌, స్పెషల్‌ మొబైల్‌ జెఎఫ్‌సిఎం న్యాయమూర్తి ఎన్‌.ఉష లక్ష్మి కుమారి, స్పెషల్‌ జెఎఫ్‌సిఎం ఫర్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ న్యాయమూర్తి ఎ.నాగ మల్లేశ్వరిలు న్యాయ మూర్తులుగా వ్యవహరించారు. రోడ్డు ప్రమాదాలు, చెక్‌ బౌన్స్‌, రాజీ పడదగ్గ సివిల్‌, క్రిమినల్‌ కేసులను పరిష్కరించామని న్యాయ మూర్తులు తెలిపారు. తద్వారా రూ.9.86.73.225 మొత్తం కక్షిదారులకు లబ్ధి చేకూరిందని అన్నారు.