Oct 26,2022 23:43

జాతీయ క్రీడలకు ఎంపికైన విద్యార్థులతో ప్రశాంత్‌కుమార్‌, జాకీర్‌ హుస్సేన్‌ తదితరులు

ప్రజాశక్తి- సీలేరు
స్థానిక డిఏవి పాఠశాల విద్యార్థులు ఖోఖో, కబాడీ జాతీయస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన భానురు బీడీఎల్‌ డిఏవి పబ్లిక్‌ స్కూల్‌ నిర్వహించిన జోనల్‌ మీట్‌ క్రీడా పోటీల్లో సీలేరు డిఏవి పాఠశాల విద్యార్థులు 17 మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఖోఖోలో అత్యధిక ప్రతిభ చూపించి జాతీయస్థాయి పదోతరగతి చెందిన కె.దేవర్షిని, కె.సారోన్‌, పి.కావ్య, 8వ తరగతికి చెందిన కె.సృజన, కబాడీలో పదో తరగతి విద్యార్థి కె.నవీన్‌ కుమార్‌ ఎంపికయ్యారు. వీరు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల డిఏవి పాఠశాల ఎల్‌ఎంసి చైర్మన్‌, ఏపీ జెన్కో ఎస్‌ఈ సివిల్‌ కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌, ఇఇ జాకీర్‌ హుస్సేన్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్రావు, పిఈటి కమలాకర్‌, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ప్రధానోపాధ్యాయులు రామచంద్రరావు బుధవారం మాట్లాడుతూ నవంబర్‌లో ఢిల్లీ జరగనున్న స్థాయి జాతీయ క్రీడల్లో తమ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.