
కాళ్ల:కాళ్లకూరు హరిజన పేటలో స్వాతంత్ర దినోత్సవ సందర్భ ంగా మంగళవారం ఎగురవేసిన జాతీయ జెండాకు అవమానం జరిగింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వెళ్లిపోయారు. అయితే వెళ్లిన కాసేపటికే జెండా కిందకు జారిపోయింది. జాతీయ పతాకాన్ని ఇంత నిర్లక్ష్యంగా కట్టడం ఏంటని, కనీస గౌరవం ఇవ్వడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు