Jun 03,2023 23:14

నిఖిల్‌ ప్రకాష్‌

ప్రజాశక్తి-పరవాడ
స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12 వరకు ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి ఈత పోటీలకు పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ చెందిన 12వ తరగతి విద్యార్థి ఎస్‌.నిఖిల్‌ ప్రకాష్‌ ఎంపికయ్యారు. ఈయన తిరుపతిలోని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 400 మీటర్ల ప్రీ- స్టైల్‌, 200 మీటర్ల బట్టర్‌ ఫ్లై ఈత పోటీల్లో రజిత పతకం సాధించి అండర్‌-19 విభాగంలో జాతీయ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్‌ ఎన్‌.సీతాలక్ష్మి వెల్లడించారు. పాఠశాల స్పోర్ట్స్‌ డైరెక్టర్‌, స్విమ్మింగ్‌ కోచ్‌ జి.మధుబాబు దగ్గర శిక్షణ పొందుతున్న నిఖిల్‌ ప్రకాష్‌ ఆటలతో పాటు గాయకుడుగా, చదువులోనూ రాణిస్తున్నాడు. ఈ విద్యార్థి ప్రతిభకు మెచ్చి పాఠశాల చైర్మన్‌ పి.సూర్యనారాయణరెడ్డి రూ.5వేలు నగదు బహుమతిని అందజేశారు. సీఈవో నిశాంత్‌, కోచ్‌లు హరినాథ్‌ రెడ్డి, బషీర్‌, కో-ఆర్డినేటర్‌ రామలక్ష్మి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.