జాతీయ గ్రాఫ్లింగ్ కుస్తీ పోటీలలో విద్యార్థినుల సత్తా
ప్రజాశక్తి - క్యాంపస్ : హర్యానాలోని రోహతక్ లో గ్రాఫ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి గ్రాఫ్లింగ్ కుస్తీ అండర్ 11-15పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు. డి.రిజ్వాన జూ.సి ఇ సి-గోల్డ్ మెడల్, కె.పావని- జూ.సి ఇ సి- సిల్వర్ మెడల్,పి. చైత్ర- జూ.హెచ్‌ఈ సి-బ్రాంజ్ మెడల్, వీరందరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.భువనేశ్వరి దేవి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ క్రీడలు చదువుకు పరోక్షంగా ఎంతో ఉపయోగపడతాయని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంచుతాయని, వ్యూహాలు, లక్ష్యాలను, మరింత శక్తి ,శ్రద్ధ మానసిక సామర్థ్యాలను పెంచుతాయని అన్నారు. మిగతా విద్యార్థినిలంతా క్రీడల్లో రాణించాలని, టిటిడి యాజమాన్యం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొని, వీరికి శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ సాయి సుమతిని అభినందించడమైనది. విద్యార్థినిల అభినందన కార్యక్రమంలో అధ్యాపకులు డా.ఎ. జయమ్మ పాల్గొన్నారు.










