Sep 21,2023 21:13

జాతీయ ఎస్‌టి కమిషన్‌ సభ్యుడికి స్వాగతం పలుకుతున్న కలెక్టర్‌, ఐటిడిఎ పిఒ

బెలగాం : జాతీయ గిరిజన తెగలు కమిషన్‌ సభ్యులు అనంత నాయక్‌ సాదర స్వాగతం లభించింది. జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా మండలంలోని ఉల్లిభద్ర గెస్ట్‌ హౌస్‌ వద్ద జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌, ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌, ఆర్‌డిఒ కె.హేమలత, జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిడి కె.శ్రీనివాసరావు పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిజన అభ్యున్నతికి జిల్లాలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో తసీల్దార్‌ జి.వెంకట జనార్ధన, తదితరులు పాల్గొన్నారు.