ప్రజాశక్తి-విజయవాడ: జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన బాలికల దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్థన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ''సాథి'' అన్‌లైన్ గూగుల్ మెయిల్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మట్లాడుతూ మార్పు ట్రస్ట్ ద్వారా కళాశాలలో ఉత్సహవంతులైన నలుగురు విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలుతో కోర్ కమిటీని నియమించి ''సాథి'' షసషషఅ్‌తీస్‌ఝa్‌ష్ట్రఱఏస్త్రఎaఱశ్రీ.షశీఎ మెయిల్‌లో నమోదైన సమస్యలకు సంబంధించిన సమాచారం ముందుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి వస్తుందని, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత విభాగాలకు తెలియజేసి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సాథి గూగుల్ మెయిల్ ద్వారా సమస్యలను తెలియచేసేవారి వివరాలను గోప్యంగా వుంచడం జరుగుతుందన్నారు. మహిళలు బాలికలు వారికి సంబంధించిన సమస్యలనే కాకుండా సమీపంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సాథి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడంలో భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ అన్నారు. ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: బాలికలను సంరక్షించుకోలేని ఏ సమజం సమానత్వాన్ని , స్వయం సమృద్ధిని సాధించలేదని మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఐఎంఎ హాలులో జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశు సంక్షేమానికి, మహిళల సర్వతోముఖాభివృద్ధికి అనేక పధకాలు అమలవుతున్నప్పటికి ఆశించిన ఫలితాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం దేశంలో అనేక చట్టాలు ఉన్నప్పటికి వారిపై అరాచకాలు తగ్గడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భ్రూణహత్యలు, శిశుమరణాలు గణనీయంగా తగ్గాయని మహిళా, శిశు సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్ధానంలో ఉందన్నారు. డిఐజి ఆఫ్ పోలీస్ (కమ్యూనికేషన్స్) ఎన్.ఎస్.జె. లక్ష్మి మాట్లాడుతూ పలు పరిశోధనల్లో బాలుర కన్నా బాలికల్లోనే గ్రాహ్య శక్తి ఎక్కువగా ఉంటుందని, పలు అంశాల్లో నైపుణ్యం బాలికలకే ఎక్కువ ఉంటుందని తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉమ మిక్కిలినేని, యూనిట్ హెడ్ గుణశేఖర్, రీజనల్ మేనేజర్ రావి శ్రీనివాసరావు, డాక్టర్ పి.వి.దుర్గారాణి, ప్రముఖ విద్యా వేత్త వెంకట్ పూలబాల, ప్రముఖ పెయింటర్ రాము అళహరి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-మైలవరం: బాలికల సంరక్షణ అందరి బాధ్యతని ఎల్బీఆర్ సీఈ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.అప్పారావు అన్నారు. స్థానిక ఎల్బీఆర్.సిఈ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ సహేలి ది గర్ల్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిసి ప్రొసీడింగ్ అధికారి పి.శోభారాణి, ఎస్.ఉమామహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజాశక్తి-చందర్లపాడు: చందర్లపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఐసిడిఎస్ కార్యకర్తలు వ్యాసరచన, వకృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులను అందజేశారు. ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు: మండల కేంద్రంలో మానవహారం, ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నుండి బాలికలచే ప్రతిజ్ఞ చేయించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఉషారాణి, నందిగామ ఐసిడిఎస్ సిడిపిఓ భాగ్యరేఖ, అంగన్వాడి కార్యకర్తలు నాగమణి, సువర్చల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: ఎర్రమాడు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలికలను ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం.హరికృష్ణ, విజయకుమార్, శ్రీనివాసరావు, కొండయ్య, జ్యోతి, దుర్గాభవాని పాల్గొన్నారు. ప్రజాశక్తి-విజయవాడ: పాఠశాల దశ నుంచి సామాజిక మాధ్యమాలు, వివిధ యాప్‌ల వినియోగం పై నియంత్రణ ఉండాలని ఎన్టీఆర్ జిల్లా దిశ పోలీస్ స్టేషన్ సిఐ వాసవి విద్యార్థినులకు సూచించారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా చైల్డ్ లైన్-1098 , ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణలంకలోని వంగవీటి మోహనరంగారావు బాలికల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గ్రేసమ్మ, దిశ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ విజయ, బర్డ్స్ ఎన్జీఓ కార్యదర్శి కె.ప్రకాష్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ నాగరాజు పాల్గొన్నారు.










