Nov 11,2023 20:27

రాజన్నదొరను ఆహ్వానిస్తున్న ఆదివాసీ సంఘ నాయకులు

సాలూరు: భగవాన్‌ బిర్సా ముండా 149వ జయంతి సందర్భంగా ఈనెల 14,15 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ ఆదివాసీ సదస్సు, సాంస్కృతిక కళా ప్రదర్శనకు హాజరు కావాలని కోరుతూ డిప్యూటీ సిఎం రాజన్నదొరకు పార్వతీపురం మన్యం జిల్లా ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ మేరకు శనివారం ఎజెఎసి మన్యం జిల్లా అధ్యక్షుడు కొండగొర్రి ధర్మారావు, ఉపాధ్యక్షులు కొండగొర్రి సుందరరావు, మజ్జి నారాయణరావు, కార్యదర్శి ఎస్‌.జయసింహ డిప్యూటీ సిఎం రాజన్నదొరను ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. పాడేరులోని విఆర్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహించనున్న ఆదివాసీ సదస్సుకు నేపాల్‌ ఆదివాసీ సమస్యల శాశ్వత ఫోరమ్‌ సభ్యులు పూల్మన్‌ చౌదరి విశిష్ట అతిథిగా, మహారాష్ట్రకు చెందిన గోండ్‌ రాజా వీరేంద్ర షా ఆత్రం గౌరవ అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు హాజరు కావాలని రాజన్నదొరను ఎజెఎసి నాయకులు కోరారు.