Sep 28,2023 18:24

జాషువాకి నివాళులర్పిస్తున్న ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డి

ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు పట్టణ వైసిపి కార్యాలయంలో గుర్రం జాషువా 128వ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎఎంసి చైర్మన్‌ తోకల కొండయ్య, వైసిపి పట్టణ అధ్యక్షులు ఎస్‌కె రఫీ, రహీం, అయ్యన్న, మహేష్‌, చనమాల రామారావు, శివ, హిపీదు, ఆదిలక్ష్మి, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.