
ప్రజాశక్తి - అమృతలూరు
మండలంలోని కూచిపూడిలో గుర్రం జాషువా 128వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. వ్యవసాయకార్మిక సంఘం ఆధ్వర్యంలో జాషువా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీయం నాయకులు బి అగస్టీన్ మాట్లాడుతూ జాషువ రచనలు విశ్వవ్యాప్తమని అన్నారు. అవమానాలు ఎదుర్కొన్న చోటే సన్మానాలు అందుకున్న గొప్ప కవి అని అన్నారు. జాషువా సామాజిక విప్లవకారుడని అన్నారు. అణగారిన వర్గాల ఆవేదననే ఆయన కవితల్లో, రచనల్లో చూపారని అన్నారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా గళం విప్పిన మహాకవి జాషువా అని అన్నారు. కార్యక్రమంలో పులివర్తి రాజు, చావలి రమేష్, కె భీమయ్య పాల్గొన్నారు.