
ప్రజాశక్తి-కలెక్టరేట్(కృష్ణా) : మతోన్మాద ,కులతత్వ విధానాలకు వ్యతిరేకంగా మహాకవి గుర్రం జాషువా రచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజేష్, ఉపాధ్యక్షులు కొడాలి శర్మ, ఐసిఇయు మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ లు పేర్కోన్నారు. మహాకవి గుర్రం జాషువా 128 జయంతి సందర్భంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాషువా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితంలో ఎన్నో అవమాన సంఘటన ఎదుర్కొన్న జాషువా ఆ అవమానియా సంఘటనలతో తన రచనలతో మానవయ్య దక్పథంతో రచనలు చేశారని నేటి పాలకవర్గాలు ప్రజల మధ్యన చీలికలు తీసుకొచ్చి మతపరంగా కుల పరంగా ప్రజల మధ్య ప్రయత్నిస్తుందని ఈ దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా కేంద్రంలోని బిజెపి పూర్తిగా మనువాద సిద్ధాంతంతో ప్రజల్ని మధ్యయుగాల వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుందని దీనికి వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని అదే జాషువా కి నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బూర సుబ్రహ్మణ్యం, ఎం.పోలి నాయుడు, జయ రావు, ఎల్‌ఐసి నాయకులు టీ చంద్ర పాల్, పూలే విజ్ఞాన కేంద్ర కన్వీనర్ పామర్తి నాగయ్య ,మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి జ్యోతి ,విజయలక్ష్మి, మరియు ఈడే రామారావు తదితరులు పాల్గొన్నారు.