* పలు పోటీల్లో సత్తా చాటిన మనోజ్
ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు: మండలంలోని నగరంపల్లికి చెందిన పలాస మనోజ్ కుమార్ కళా రంగంలో సత్తా చాటుతున్నారు. వృత్తిరీత్యా పలాసలోని శ్రీచైతన్య కళాశాలలో ఫ్యాకల్టీగా చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి జానపదంపై మక్కువతో ఊర్లో భజనలు, ఇతర భజన పోటీల్లో పాల్గొంటూ తన ప్రస్థానం ప్రారంభించారు. డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల కాలంలో ఓ న్యూస్ ఛానల్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర దమ్మున్న జానపదంలో ఎంతోమంది ప్రముఖ కళాకారులతో కలిసి తన తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. 'సిత్తరాల సిరపడు' పాటతో సినీమాకి పరిచయమెన జానపద కళాకారుడు బాడ సూరన్న, వరంగల్ శ్రీనన్న, స్టేట్ కల్చరల్ చైర్‌పర్సన్ వంగపండు ఉష, సినీ ఇండిస్టీలో మెచ్చుకోదగ్గ దర్శకుడు సత్యానందలచే ప్రశంసలు పొందారు. బాడ సురన్న, మోహన్, మనోజ్ ఇందులో టీం లీడర్లుగా వ్యవహరించారు. జానపద గాయకుడు రేలా రేలా రఘు, జానకిరామ్, గౌరీశ్వర్, రామారావు, వెంకటరమణ మాస్టర్ తదితర టీంలతో కలిసి పనిచేశారు. జానపద పుట్టుపూర్వోత్తరాలను శోధించే బద్రి కూర్మారావు, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఉపాధ్యక్షుడు కుమార్‌నాయక్, సిక్కోలు జానపద కళాక్షేత్రం ఫౌండర్ దేవరాజ్ ఎంతోమందితో కలిసి తన గళాన్ని వినిపించారు. ఇటీవల కాలంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, పశుసంవర్థశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఎంపీరామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.










