Sep 28,2023 23:04

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
మండలంలోని గంగవరం శ్రీ వలేటి కృష్ణయ్య ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధిని జవ్వాది మాన్యతకి జానపద నృత్యానికి జిల్లా స్ధాయిలో ప్రధమ స్ధానం లభించింది. ఎపి ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ బాపట్ల వ్యవపాయ కళాక్షేత్రంలో నిర్వహించిన పోటీల్లో మాన్యతకు బహుమతి దక్కింది. యువజన శాఖ స్టెప్‌ 1అధికారి ఎస్‌ పల్లవి, జిల్లా సైన్స్‌ అధికారి షాదిక్‌ చేతుల మీదుగా మాన్యత బహుమతి అందుకుంది. ఈ సందర్భంగా మాన్యతను, టీచర్‌ సుమలతను, హెచ్‌ఎం కె వీరాంజనేయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.