తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్న మసీదు మేటీలు
ప్రజాశక్తి - కౌతాళం
కౌతాళంలోని జామియా మసీదు ముత్తవల్లి మహ్మద్ ధనిష్ అక్రమాలపై విచారించి చర్యలు తీసుకోవాలని మసీదు మేటీలు టైలర్ ఖాదర్ బాషా, హుస్సేన్, ముల్లా ఖాసీం, ముల్లా ఖాదర్‌బాషా, షేక్ అహ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో స్పందనలో తహశీల్దార్ రమేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 8 ఏళ్ల నుంచి మసీదు ఆదాయం లెక్కలు ఎవరికీ చూపించకుండా, సొంత పనులకు డబ్బులు ఉపయోగించుకున్నారని తెలిపారు. ముత్తవల్లి తండ్రి మద్యం సేవించి మసీదులో వచ్చి అజా ఇస్తున్నారని చెప్పారు. ఈ విషయాలపై వక్ఫ్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ముత్తవల్లి మహ్మద్ ధనిష్‌ను తొలగించి నూతన కమిటీని ఏర్పాటు చేసి మసీదు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.










