Oct 24,2023 20:39

అగ్నికి ఆహుతయిన జామతోట

        బెలుగుప్ప : ప్రమాదవశాస్తూ 13 ఎకరాల సాగు చసిన జామ తోట అగ్నికి ఆహుతైన ఘటన మండల పరిధిలోని దుద్దేకుంట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధిత రైతు హనుమంతరాయుడు వివరాల మేరకు.. తనకున్న 13 ఎకరాల్లో రూ.లక్షలు వెచ్చించి తేవాన్‌ రకం జామ పంట సాగు చేసినట్లు తెలిపారు. దాదాపు మూడు సంవత్సరాలుగా జామ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుండగా ప్రస్తుతం కోతల సమయంలో ఉందన్నారు. ఈసమయంలో ప్రమాదవశాత్తు అగ్నిక ఆహుతై దాదాపు రూ.20 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి రైతులను అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.