Oct 29,2022 23:39

జాబ్‌ మేళాలో మాట్లాడుతున్న వక్తలు

ప్రజాశక్తి-పెందుర్తి : స్థానిక ఆదర్శ్‌ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్‌మేళాకు 240 మంది యువతీయువకులు హాజరుకాగా 79 మంది వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించినట్లు కాలేజీ ప్రిన్సిపల్‌ ఎన్‌ఇ.ఫ్లోరా తెలిపారు. ఈ సందర్బంగా కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్‌ టి.థియోఫిలస్‌ మాట్లాడుతూ, తమ విద్యాసంస్థలో ప్రతి నెలా జాబ్‌ మేళాలు నిర్వహించి వందలాది మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకు సాగుతామని వెల్లడించారు. ఆలివ్‌ ఫౌండేషన్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.రామకృష్ణ, ఉన్నత భారత అభియాన్‌ కో-ఆర్డినేటర్‌ పావని ఆధ్వర్యాన జాబ్‌ మేళా నిర్వహించినట్లు తెలిపారు. జాబ్‌ మేళాను ఆదర్శ్‌ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఎ.శ్రీనివాసరావు, ఎఒ జి.రవి, ఎపిఎస్‌ఎస్‌డిసి ఏరియా స్కిల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, కళాశాల ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ సిబ్బంది ఫాతిమునిస బేగం, జగదీశ్వరి, కమలారాణి, నాగమణి, అనూష పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌లు ఇమ్మార్టికస్‌ కిషోర్‌, ఆర్సిస్‌ సుమంత్‌, డెక్కన్‌ సుప్రియ, టైమ్స్‌ ప్రో వెంకటేష్‌, మెయిన్‌ టెక్‌ హెచ్‌సిఎల్‌ ప్రతినిధి దీపక్‌, అపోలో ఫార్మసీ ప్రతినిధి నాగశేఖర్‌ పాల్గొన్నారు.