Jul 24,2023 00:43
గ్రామంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

ప్రజాశక్తి-యద్దనపూడి: మండల కేంద్రమైన యద్దనపూడి గ్రామంలో స్థానిక శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు ఆదివారం పర్యటించారు. పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు సవరణ జాబితాలో పాల్గొనాలని చెప్పారు. ఎంఎల్‌ఎతో పాటు నాయకులు రావిపాటి సీతయ్య, కె నాగేశ్వరరావు, వెంకటస్వామి, వజ్జా సుబ్బ రామయ్య, వి వీరయ్య, పి సాంబశివరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.