ప్రజాశక్తి-నందిగామ
నందిగామ పట్టణంలోని కె.వి.ఆర్ కళాశాలలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సి.డాప్, డిస్ట్రిక్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్‌ల సంయుక్త పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళా ను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్సి మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ ప్రాంత నిరుద్యోగులు, యువతీయువకులు, విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందులో భాగంగానే మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. రానున్న గ్రామ సచివాలయ ఉద్యోగాలకు కూడా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఉద్యోగాలకు హాజరయ్యే నిరుద్యోగులకు సాఫ్ట్ స్కిల్ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటుకు కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిపి నాగేశ్వర్ రెడ్డి, ఆర్డీవో రవీంద్ర, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు నరేష్, కిరణ్, సువర్ణ రాజు, కెవిఆర్ కళాశాల ప్రిన్సిపల్ రాయప్ప, చైతన్య కళాశాల అధినేత అమరనేని రమేష్, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు- కోఆప్షన్ సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.










