
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ రవి, ఇతర అధికారులు
ప్రజాశక్తి-అనకాపల్లి
జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9న నిర్వహించే జాబ్ మేళా కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికను జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని అర్హత గల విద్యార్థులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రాజ్, డిఆర్‌వో వెంకటరమణ, స్కిల్ డెవలప్మెంట్ అధికారి చాముండేశ్వరరావు పాల్గొన్నారు.