కూలీలతో మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి - ఆస్పరి
జాతీయ ఉపాధి హామీ చట్టంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహా కార్యదర్శి బాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని ములుగుందం గ్రామంలోని ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి పని ప్రదేశంలో టెంట్లు, కిట్లు ఏర్పాటు చేయాలని, లేకపోతే కూలీలు వడ దెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రోజువారీ వేతనం రూ.600 ఇవ్వాలని కోరారు. ప్రతి జాబ్ కార్డుకు 200 రోజులు పని దినాలు కల్పించాలని తెలిపారు. లేకపోతే ఉపాధి కూలీలతో కలిసి సచివాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. వ్యకాస మండల నాయకులు రామాంజనేయులు, సల్మాన్, రామన్న, శేఖర్ పాల్గొన్నారు.










