సమావేశంలో మాట్లాడుతున్న మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు
ప్రజాశక్తి - దేవనకొండ
గ్రామాల్లో జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకీ ఉపాధి పనులు కల్పించాలని, హార్టికల్చర్ కింద ఉచితంగా రైతులకు ఇస్తున్న పండ్ల మొక్కలపై అవగాహన కల్పించి పండ్ల తోటల పెంపకాన్ని అభివృద్ధి చేయాలని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఏపీడీ పద్మావతి తెలిపారు. బుధవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఉపాధి హామీ చట్టం పనులపై ఏపీఓ కృష్ణమూర్తి అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు తప్పకుండా పనులు కల్పించాలని ఆదేశించారు. ప్రతి కూలీకీ రూ.272 వేతనం అందేలా పనులు చేయించాలని తెలిపారు. ప్లాంటేషన్ సూపర్‌వైజర్ రత్నం, ఈసీ రంగస్వామి, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










